అనుభవాలు:
తౌఫిక్ పుస్తకం: యాన్ ఇడియట్, ప్లేస్‌మెంట్స్ అండ్ ఇంటర్వ్ యూ
ఇంజినీరింగ్ కోసం మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వచ్చాడు తౌఫిక్. సరికొత్త స్నేహాలు వ్యసనాల ఊబిలోకి లాగాయి. ఆపై ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం. టాపర్ కాస్తా సగటు విద్యార్థిగా మారిపోయాడు. ఎలాగో చదువు గట్టెక్కించి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం కొట్టాక పెళ్లి మాటెత్తాడు. లవర్ హ్యాండిచ్చింది. ఆ బాధలోంచే అక్షరాలు తన్నుకుంటూ వచ్చాయి. కాలేజీ అనుభవమే ముడిసరుకైంది. ప్రేమ, సంతోషం, విజయం, బాధ... ప్రతి భావాన్ని సూటిగా చెప్పాడు. కుర్రకారు గుండెల్ని తాకాడు. ఇది కేవలం ప్రేమ కథే కాదు. కీలక సమయంలో వ్యసనాలు చేసే చెడు, ఉద్యోగాల కోసం పడే బాధలు అక్షరీకరించాడు. ఇంటర్వ్యూలు ఎలా ఎదుర్కోవాలో సూచించాడు. చదివే వాళ్లంతా తమ కథే అనుకునేలా మలిచాడు. పగలు ఉద్యోగం. రాత్రి రచన. ఆలోచనలు నవలారూపం దాల్చడానికి ఆర్నెళ్లు పట్టింది. మొదట్లో సొంతంగా కాపీలు అచ్చు వేయించినా, రెండో ప్రచురణ ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ టైమ్స్ గ్రూప్ తీసుకుంది. నాలుగు వేలకు పైగా అమ్ముడయ్యాయి.
--
"You will never find time for anything.You must make it."
0 comments:
Post a Comment
Thanks for visiting us. Yours - m&k