ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు. రెండు సమూహాల మధ్య కక్షలు. రెండు దేశాల మధ్య విద్వేషాలు. కారణం మనిషిలో రగిలే భావోద్వేగాలే. ఆదిలాబాద్ కుర్రాడ్ని ఇది ఆలోచనల్లో పడేసింది. ఈ అసహజ భావోద్వేగ తీవ్రతను తగ్గించడానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. వ్యాసరచన పోటీల్లో ముందుండే అతడి నేపథ్యం పుస్తకం రాయడానికి ప్రేరేపించింది. అప్పుడతడు ఇంటర్ విద్యార్థి. చదువుతూనే ఖాళీ సమయాల్లో ఆలోచనలకు పని చెప్పాడు. అవి 'ఎమోషన్స్' పుస్తకంగా మారడానికి నెలలు పట్టింది. వస్తూనే నాలుగు వేల కాపీలు అమ్ముడయ్యాయి. 'ఒకవిధంగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలోని మనుషులంతా రక్తసంబంధీకులే. పగ, ప్రతీకారం, కుట్ర, మతవిద్వేషాలు వాళ్ల మధ్య చిచ్చుపెడుతున్నాయి. వీటికి బదులు ప్రేమ, స్నేహం అనుబంధాలు పంచితే మనమంతా ఒక కుటుంబంలా మెలగొచ్చు' అని తన పుస్తకంలో చెప్పాడు.
"You will never find time for anything.You must make it."
0 comments:
Post a Comment
Thanks for visiting us. Yours - m&k